Categories
Telangana Telugu

#Karthikeya2: షాకింగ్ …హిందీ వెర్షన్… రెండో రోజుకే 300% గ్రోత్

Reading Time: < 1 minute

టాలీవుడ్‌కి మంచి టైమ్‌ మళ్లీ మొదలైంది. కేవలం పది రోజుల గ్యాప్‌లోనే మూడు సినిమాలు మంచి హిట్ అయ్యాయి. థియేటర్లు జనాలతో కళకళలాడుతున్నాయి. ఇండస్ట్రీ సమస్యల గురించి నిర్మాతలు చర్చించుకునే సమయంలో రిలీజైన మూడు సినిమాలు హిట్ అవ్వడంతో ఆనందపడాల్సిన విషయం. ముఖ్యంగా ఈ వారం రిలీజైన కార్తికేయ 2 చిత్రం హిందీ మార్కెట్ లోనూ దుమ్ము రేపుతోంది. ఈ మేరకు బాలీవుడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

తరుణ్ ఆదర్శ్ లెక్కల ప్రకారం ఈ సినిమా శనివారం నాడు అతి తక్కువ స్క్రీన్స్ తో కేవలం 7 లక్షలు మాత్రమే వచ్చింది. ఆదివారం 28 లక్షలకు పెరిగింది..సోమవారం 35 లక్షలు అయ్యాయి.  రెండో రోజుకే 300% గ్రోత్ కనపడింది.

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ల పై టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు సంయుక్తంగా నిర్మించారు. హీరో ఓ పనిపై ద్వారకా నగరం వెళ్లటం అక్కడ చోటు చేసుకునే ఊహించని పరిణామాలు, అక్కడ జరిగే ప్రమాదాలు వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. కార్తికేయ చిత్రంలోలానే ఈ మూవీలో కూడా ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయి అని టీజర్, ట్రైలర్ వంటివి స్పష్టంచేశాయి. దీంతో సినిమా పై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. అందువల్ల ఈ సినిమాకు ఓపినింగ్స్ బాగున్నాయి. బిజినెస్ కూడా బాగా జరిగింది.