Categories
Telangana Telugu

#Nikhil: అబ్బబ్బే దిల్ రాజు తప్పేమీలేదు…నిఖిల్ యూటర్న్

Reading Time: < 1 minute

గత కొద్ది రోజులుగా నిఖిల్ సినిమా కార్తికేయ 2  రిలీజ్ కు దిల్ రాజు అడ్డం పడ్డాడనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.  అయితే ఇప్పుడా సినిమా రిలీజైంది. దిల్ రాజుతో మనకు తగువు ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ ..వెంటనే యూటర్న్ తీసుకున్న ఓ వీడియో లాంటిది విడుదల చేసి, దిల్ రాజు తప్పేమీ లేదు…ఒకే రోజు రెండు సినిమాలు ఎందుకు రిలీజ్ చేయటం అని ఆయన పెద్ద మనస్సుతో ఆలోచించారు…అందుకే నా సినిమా ప్రక్కన పెట్టాం. దిల్ రాజు వంటి పెద్ద నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అండ లేకపోతే నా సినిమా ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ అయ్యేది కాదు అని తేల్చి చెప్పేయటం తో అందరూ షాక్ అయ్యారు.

వాస్తవానికి కార్తికేయ 2 అన్ని పనులు పూర్తిచేసుకుని జూలై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధం అయింది.  అయితే సినిమా ధియేటర్లు దొరకని నేపథ్యంలో సినిమా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.. అదే సమయానికి నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా కూడా విడుదలవుతున్న నేపథ్యంలో నిఖిల్ సినిమాను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  ‘కార్తికేయ 2’ నిర్మాతలు రిలీజ్ కోసం చాలా తిప్పలు పడ్డారు. దిల్ రాజు బలం ముందు వీరి బలగం సరిపోలేదని కామెంట్స్ వచ్చాయి.  దిల్ రాజే కావాలని ‘కార్తికేయ 2’ను పక్కకు తప్పించారని ఇండస్ట్రీలో విమర్శలు వినిపించాయి. అలాగని థాంక్స్ సినిమా ఆడలేదు. డిజాస్టర్ అయ్యింది.

‘కార్తికేయ 2’ సినిమాకి థియేటర్స్ లేకపోవడ వల్ల.. ఆగస్టు 12 కు రిలీజ్ డేట్ ను పోస్ట్ ఫోన్ చేసుకుని రిలీజ్ అయ్యింది.  అయితే   ఈ సినిమా పాన్ ఇండియా ఫిల్మ్ గా వచ్చింది.  దాంతో  దిల్ రాజు కారణంగా మిగిలిన భాషల్లో కూడా సినిమాని పోస్ట్ ఫోన్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఆల్ రెడీ సినిమా ప్రమోషన్స్ కోసం బాగా ఖర్చు పెట్టారు. ఇప్పుడు అదంతా వృధా అయిపోయింది. కాకపోతే సినిమా హిట్ టాక్ రావటంతో టీమ్ రిలీఫ్ అయ్యింది.

ఇక నిఖిల్ సిద్ధార్థ తెరమీద కనపడక రెండు సంవత్సరాలు దాటింది. ఇటీవల రిలీజ్ అయిన కార్తికేయ 2 సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అర్జున్ సురవరం తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం అయ్యాయి. కార్తికేయ 2 సినిమా మీద నమ్మకంతో 18 పేజెస్, స్పైలను ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. ఆ నమ్మకం ఇప్పుడు వారిని గెలిపించింది.