Categories
Telangana Telugu

#Salaar:నోట్ చేసుకోండి… రిలీజ్ డేట్ ఇచ్చేసారు

Reading Time: < 1 minute

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (prabhas), కేజీఎఫ్ ఫేం ప్ర‌శాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేష‌న్‌లో రూపొందుతున్న భారీ క్రేజీ ప్రాజెక్టు స‌లార్ (Salaar).ఈ సినిమా అప్డేట్స్ కోసం  అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్నారు. ఆ  రోజు వచ్చేసింది ‘సలార్‌’ (SALAAR) టీమ్‌ నుంచి సరికొత్త అప్‌డేట్‌ బయటకు వచ్చింది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ స్పెషల్‌  పోస్టర్‌ షేర్‌ చేసింది. టీమ్ ఇచ్చిన అప్‌డేట్‌తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ‘సలార్ ఆగమనం‌’ అనే ట్యాగ్‌ సోషల్‌మీడియా ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ‘అన్న వస్తుండు..’ అంటూ అభిమానులు సందడి చేస్తూ హంగామా చేస్తున్నారు.

‘రాధేశ్యామ్‌’ తర్వాత ప్రభాస్‌ నటిస్తోన్న చిత్రం ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. కమర్షియల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది సిద్ధమవుతోంది. ఇందులో ప్రభాస్‌ కొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నారు. శ్రుతిహాసన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్‌ దీన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ శరవేగంగా జరుగుతోంది. ఇవాళ 75వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా మేక‌ర్స్ ప్ర‌భాస్ అభిమానుల‌కు అదిరిపోయే అప్‌డేట్ అందించారు. దీంతోపాటు 2023 సెప్టెంబ‌ర్ 28న సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కాబోతుంద‌ని ప్ర‌క‌టించారు.

డార్క్ షేడ్స్ బ్యాక్ డ్రాప్ లొకేష‌న్‌లో కౌబాయ్ లుక్ గుర్తుకు తెచ్చేలా ఓ వైపు పిస్తోల్స్, మ‌రోవైపు పదునైన క‌త్తులు ప‌ట్టుకుని స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తూ విజువ‌ల్ ట్రీట్ అందిస్తున్నాడు ప్ర‌భాస్‌. ఈ మూవీలో కోలీవుడ్ బ్యూటీ శృతిహాస‌న్‌ (Shruti Haasan) ఫీమేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. అండ‌ర్ వ‌ర‌ల్డ్ యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్ట‌ర్ శివ‌కుమార్. కేజీఎఫ్ ప్రాంచైజీకి సంగీతం అందించిన ర‌విబ‌స్రూర్ మ‌రోసారి ఈ క్రేజీ కాంబో సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

హోంబ‌లే ఫిలిమ్స్ ప‌తాకంపై విజ‌య్ కిరగందూర్ (Vijay Kirgandur) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌లార్‌లో థ్రిల్ క‌లిగించే యాక్ష‌న్ స‌న్నివేశాలు రెడీ చేస్తున్నాడ‌ని తాజా లుక్‌తో చెప్పేశాడు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌నీల్‌. స‌లార్‌లో లోయ ప్రాంతంలో వ‌చ్చే భారీ ఛేజింగ్ ఎపిసోడ్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉండ‌నుంద‌ట‌.