విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ సినిమా కూడా ఇదివరకు పూరీ చేసిన సినిమా ‘అమ్మా, నాన్న, ఓ తమిళమ్మాయి’ కాపీ అని ప్రేక్షకులు ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై విజయ్ దేవరకొండ స్పందించారు. తాను ఇప్పటిదాకా రీమేక్ లు చేయలేదని, అలాంటి కంటెంట్ ఉన్నా ఇంట్రస్ట్ చూపనని చెప్పారు. ఇది ఫ్రెష్ కథ అని, అలాంటి ఆలోచన చేయద్దని చెప్పారు. అలాగే
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ కలిసి చేస్తున్న చిత్రమే ‘లైగర్’. ఇందులో బాక్సర్ పాత్రలో రౌడీ హీరో అలరించనున్నాడు. పూర్తిస్థాయి బాక్సర్‌గా కనిపించడం కోసం విజయ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అయితే లైగర్ కథను చూస్తుంటే ఇంతకు ముందు పూరీ తెరకెక్కించిన ‘అమ్మా, నాన్న, ఓ తమిళమ్మాయి’లాగానే ఉందని భావిస్తున్నారు ప్రేక్షకులు. అందులో జయసుధ, రవితేజ లాగా ఇందులో రమ్యకృష్ణ, విజయ్ అని అంటున్నారు. అంతే కాకుండా ఈ రెండు చిత్రాలు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కినవే.
పూరీ జగన్నాధ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. లైగర్ పూర్తిగా కొత్త చిత్రమని అన్నారు. తన ముందు సినిమాల రిఫరెన్స్ ఏమీ ఇందులో ఉండదని అన్నారు. లైగర్ పూర్తిగా స్పోర్ట్స్ డ్రామా కాదని, ఒక పక్కా కమర్షియల్ సినిమా అని క్లారిటీ ఇచ్చారు. పైగా ఇందులో మంచి లవ్ స్టోరీ కూడా ఉందని బయటపెట్టారు. లైగర్‌లో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ భామ అనన్య పాండే నటించింది. ఇక ఈ మూవీ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ సినిమా ప్రమోషన్స్ కూడా లైగర్ తరహాలో జరగలేదు. విజయదేవరకొండ, అనన్య పాండే కలిసి దేశవ్యాప్తంగా ముఖ్యంగా నార్త్ ఇండియాలో భారీగా ప్రచారం చేస్తున్నారు. పబ్లిక్ స్పాట్స్ అయిన షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్‌లకు వెళ్లి అక్కడ అభిమానులను కలుసుకుంటున్నారు లైగర్ జోడీ. ఇక విజయదేవరకొండకు బాలీవుడ్‌లో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.