ఈ పండక్కి అందరి దృష్టీ నిలిచింది చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య బాలకృష్ణ మూవీ వీరసింహారెడ్డిల మీదే.ఇవి రెండూ కూడా బాక్సాపీస్ దగ్గర అంచనాల్ని మించి ఆడేశాయన్న విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య అదిరిపోయే వసూళ్లతో బ్లాక్బస్టర్ రేంజిని అందుకుంది. వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయి ప్రపంచవ్యాప్తంగా బయ్యర్లను సేఫ్ జోన్లోకి తెచ్చేసింది. రెండో వీకెండ్లో కూడా మంచి వసూళ్లు రాబట్టేలా కనిపిస్తున్న ఈ చిత్రం ఫుల్ రన్లో బయ్యర్లకు మంచి లాభాలను అందించేలా ఉంది. ఇక వీరసింహారెడ్డి తొలి రోజే మెజారిటీ షేర్ తెచ్చుకోవడంతో… ఆ తర్వాత జోరు తగ్గినా ఇబ్బంది లేకపోయింది. ఈ నేపధ్యంలో పండగకు రిలీజైన మరో రెండు తమిళ సినిమాలు తెగింపు, వారసుడు కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నాయి.
దిల్ రాజు అనువాద చిత్రం వారసుడు లేటుగా బరిలోకి దిగినప్పటికీ.. దాని స్థాయిలో అది మంచి వసూళ్లే రాబట్టింది. చిరు బాలయ్యల సినిమాల ఓవర్ ఫ్లోస్ దీనికే బాగా కలిసొచ్చాయి. తెలుగులో విజయ్ సినిమాల్లో అత్యధిక షేర్ సాధించిన చిత్రంగా వారసుడు నిలవబోతోంది. అనువాద చిత్రం తెగింపు దాని స్థాయిలో మంచి వసూళ్లే రాబట్టింది. తక్కువ పెట్టుబడి కావడం వల్ల అది కూడా బ్రేక్ ఈవెన్ అయింది. కళ్యాణం కమనీయం కంటెంట్ పరంగా నిరాశపరిచినప్పటికీ.. కొంతమేర ఓవర్ ఫ్లోస్ కలిసొచ్చి ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిందని సమాచారం. ఇవన్నీ ఇలా ఉన్నా..సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించి వెనక్కి తగ్గిన చిత్రం గురించి ఇప్పుడు సోషల్ మీడియా జనం మాట్లాడుతున్నారు.
అదే రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం విద్యా వాసుల అహం (Vidya Vasula Aham). ఇప్పటికే విడుదలైన కూల్ పోస్టర్ ఫీ మేల్ లీడ్ క్యారెక్టర్ మేల్ క్యారెక్టర్‌పై ఎలా ఆధిపత్యం చెలాయిస్తుందో చెబుతూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేద్దామని ప్లాన్ చేసారు. తెల్లవారితే గురువారం ఫేం మణికాంత్ గిల్ ఈ మూవీని డైరెక్ట్ చేసాడు. అయితే ఈ సినిమా పండగకు రిలీజ్ కాలేదు. వీరసింహారెడ్డి (Veera Simhareddy) జనవరి 12న విడుదల అవ్వగా.. వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) జనవరి 13న విడుదల అయ్యింది. ఈ రెండు భారీ చిత్రాలతో పోటీగా జనవరి 14న విడుదల చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నారు మేకర్స్. అయితే విద్యా వాసుల అహం చిత్రం సంక్రాంతి పోటీలోకే రాకుండా ప్రక్కకు వెళ్లింది. ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై లక్ష్మి నవ్య మక్కపాటి-రంజిత్ కుమార్ కొడాలి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కల్యాణి మాలిక్ ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం అందిస్తున్నాడు.