Categories
Telangana Telugu

Liger:‘లైగ‌ర్‌’హిందీ మార్కెట్ లో ఎందుకు వర్కవుట్ అవుతుందో చెప్పేసిన విజయ్

Reading Time: < 1 minute

పూరీ, విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రమే ‘లైగర్’. ఈ మూవీ ఆగస్ట్ 25న విడుదల కానుంది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం టీమ్ ప్రమోషన్ లో బిజీగా ఉంది. దేశం మొత్తం భారీ ఎత్తున రిలీజ్ చేస్తూండటంతో అన్ని ముఖ్యమైన ప్రాంతాలను తమ సినిమా ప్రమోషన్స్ తో కవర్ చేస్తున్నారు.

ఈ రోజు లైగర్ హీరో,హీరోయిన్స్ విజయ్ దేవరకొండ, అనన్య ఇద్దరూ  దేశం మొత్తం తిరుగుతున్నారు. అక్కడ లోకల్ మీడియాకు ఇంటర్వూలు, ఫోజులు ఇస్తున్నారు.  ఈ నేపధ్యంలో ఆయన్ని ఓ ప్రశ్న మీడియా వారు అడిగారు…లైగర్ సినిమా హిందీ మార్కెట్ లో వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారా అని అడిగారు. దానికి విజయ్ దేవరకొండ చాలా కాన్ఫిడెంట్ గా సమాధానం ఇచ్చారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ…. ఆడియన్స్ ని థియేటర్స్ కు  రప్పించటమే  ఛాలెంజ్…ఒక్కసారి వస్తే వాళ్లని సాటిస్ ఫై చేయటంలో డౌట్ లేదు…అలాంటి కంటెంట్ ఉంది అని చెప్పుకొచ్చారు.

ఇక “లైగర్” ప్రమోషన్  కోసం విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్లినా జనం పోటెత్తుతున్నారు. ఈ క్రౌడ్ ను కంట్రోల్ చేయలేక ఈవెంట్స్ క్యాన్సల్ చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రీసెంట్ గా  నవీ ముంబైలో జరిగిన లైగర్ ఈవెంట్ జనసంద్రంగా మారిపోయింది. అదే సీన్ బీహార్ రాజధాని పాట్నాలోనూ కనిపించింది. అక్కడి ఏఎన్ కాలేజీలో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ కూడా ముంబైలాగే భారీ జన సమూహం వల్ల ఈవెంట్ రద్దు చేశారు.

ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ పోరడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియర్ అయ్యాడనేదే ఈ సినిమా కథ.  హీరోగా విజయ్ దేవరకొండకు దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు ఇది తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ సినిమాలో  సునీల్ శెట్టి (Sunil Shetty) డాన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారట. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని సమాచారం.