నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ ఇటీవల నిర్వహించిన సంగతి తెలిసిందే వేదికపై ఉన్న జయరాం అనే ఆర్టిస్ట్ గురించి ప్రస్తావం తీసుకొచ్చారు. “ఇక ఈయన ఉన్నారంటే సెట్లో నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకునే వాళ్లం” అని అనేశారు. ‘అక్కినేని.. తొక్కినేని’ అనగానే అది ఎవరి గురించి అన్నారో అర్థం చేసుకున్న సభలో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే బాలయ్య ఫ్లోలో మరో వ్యక్తి గురించి మాట్లాడటంతో ఎవరూ ఈ విషయాన్ని అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు.
అయితే అక్కడ వారు పట్టించుకోకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు ఓ రేంజ్లో స్పందిస్తున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ విధంగా అహంకార పూరిత మాటలు మాట్లాడటం తగదని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు వర్గాల అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ విషయంపై అక్కినేని అభిమానులు ఫైర్ అవుతండగా.. అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.తాజాగా ఈ అంశంపై అక్కినేని వారసుడు నాగచైతన్య స్పందించాడు. కళామతల్లి ముద్దుబిడ్డలను అగౌరవపరచడం మనల్ని మనం కించపరచుకోవడమేనని స్పష్టం చేశాడు.
— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023
‘‘నందమూరి తారక రామారావుగారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్.వి రంగారావు గారు.. వీరంతా తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడమంటే మనల్ని మనమే కించపరుచుకోవడం..’’ అని నాగచైతన్య, అఖిల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.