ఈసారి సంక్రాంతి విజేత వాల్తేరు వీరయ్యనే అనే విషయం రిలీజైన రెండు మూడు రోజుల్లోనే క్లారిటి వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. బాబీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ నెల 13న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పాజిటివ్ టాక్‌తో దుమ్ముదులుపుతోంది.
మొదటిరోజు నుంచి వసూళ్ల మోత మోగిస్తూ సాగిపోయిన ఈ చిత్రం.. పండుగ సెలవులను బాగా ఉపయోగించుకుందనే చెప్పాలి. శుక్రవారం మొదలుకుని కనుమ సెలవు అయిన సోమవారం వరకు హౌస్ ఫుల్ వసూళ్లతో రన్ అయిన వీరయ్య.. మంగళవారం నుంచి కొంచెం జోరు తగ్గించినా వీకెండ్ వచ్చేసరికి మళ్లీ వీరయ్య వాయింపు మొదలైపోయింది. శనివారం సాయంత్రం నుంచి మళ్లీ హౌస్ ఫుల్ బోర్డులు పడిపోయాయి.
ఆదివారం అయితే చిరంజీవి సినిమా దూకుడు మామూలుగా లేదు. మెజారిటీ ఏరియాల్లో ప్యాక్డ్ హౌస్‌లతో నడిచింది ఆదివారం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అయితే వాల్తేరు వీరయ్య ఊపు మామూలుగా లేదు. సినిమా 10 రోజుల్లో 120 కోట్ల మార్క్ కు రీచ్ అయ్యిందని చెప్తున్నారు. ఆర్ ఆర్ ఆర్, బాహుబలి 2 తర్వాత ఆల్ టైమ్ 3వ హైయిస్ట్ షేర్ సాధించిన చిత్రంగా డిక్లేర్ చేసారు. వెస్ట్ గోదావరి, గుంటూరు బయ్యర్లకు ఈ సినిమా ప్రోఫెట్ జోన్ లోకి తీసుకెళ్లిపోయింది. గుంటూరు బయ్యర్లు బ్రేక్ ఈవెన్ వచ్చేసింది. నెక్ట్స్ వీక్ నుంచి లాభాల్లో పడతారు. యునానమస్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా క్లారిటి వచ్చేసింది.
ఉత్తరాంధ్రలో ఈ సినిమాను తెగ చూస్తున్నారు జనం. వీరయ్య పాత్రకు, చిరు పెర్ఫామెన్స్‌కు బాగా కనెక్ట్ అయిపోయిన జనాలు.. విరగబడి థియేటర్లకు వస్తున్నారు. వైజాగ్, గోదావరి జిల్లాల్లో ఆదివారం ఫస్ట్, సెకండ్ షోలకు ఎక్కడా టిక్కెట్లు దొరకటం లేదన్నది ట్రేడ్ వర్గాల టాక్.