Home Cinema Review ఎస్వీ కృష్ణారెడ్డి ‘ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు’ రివ్యూ

ఎస్వీ కృష్ణారెడ్డి ‘ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు’ రివ్యూ

15
0
Reading Time: 3 minutes

ఎస్వీ కృష్ణారెడ్డి ఇప్పటికీ అప్పుడు ఇచ్చిన హిట్స్ ఇస్తారని ఎవరికి పెద్దగా నమ్మకం లేదు కానీ ఓ మాదిరిగా అయినా సినిమా ఉంటుందేమో అని ఆశపడటంలో తప్పు లేదు. అయితే ఎందుకనో వింటేజ్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ హిట్ అయినట్లు వింటేడ్ డైరక్టర్స్ కావటం లేదు. ఈ కాలానికి వాళ్లు ప్రయాణం చేయటం కష్టంగా ఉంది. చిరంజీవి తన వాల్తేరు వీరయ్యలో జంబలకిడి జారు మిఠాయి అని ఈ కాలం కుర్రాళ్ల పల్స్ పట్టుకునే ప్రయత్నం చేసారు. సక్సెస్ అయ్యారు. కానీ ఎస్వీ కృష్ణారెడ్డిలో అది కొరవడింది. తొంభైల నాటి స్టోరీ లైన్ ని తీసుకుని అప్పటి టైప్ లోని కొన్ని కామెడీ ట్రాక్ లు కలుపుకుని మనని నవ్వించే ప్రయత్నం చేసి నవ్వులు పాలయ్యారు. అసలు టైటిల్ చూడగానే మనకు ఇంకా ఈయన ఇలాంటి టైటిల్ పెట్టి ఏమి తీద్దామనుకుంటున్నారు అనిపిస్తుంది. పెద్దింటి అమ్మాయిని పేదింటి అబ్బాయి ప్రేమించడం.. దానిని అమ్మాయి తండ్రి అంగీకరించకపోవడం వల్ల వచ్చే సమస్యల చుట్టూ కామెడీ కోసం తెచ్చి పెట్టుకొన్న కొన్ని ట్రాక్‌లు చుట్టేసి ప్రేక్షకులకు వడ్డించేందుకు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రయత్నం చేశాడని ఈ సినిమా చూసిన తర్వాత అనిపిస్తే అది మీ తప్పూ కాదు. ఇంతకీ కథేమిటంటే..

రెండు వరస ఫెయిల్యూర్స్ తీసి ఖాళీగా ఉన్న దర్శకుడు విజయ్ (సోహెల్) . మూడో సినిమానైనా సక్సెస్ చేయాలని కలలుకనే అతన్ని తండ్రి మందలిస్తాడు. దాంతో తండ్రి చేసిన కొండపల్లి కొయ్య బొమ్మలు మార్కెట్ చేద్దామననుకుంటాడు. తన తెలివితో విజయ్ ఓ స్టార్ హోటల్ తో టై-అప్ అయ్యి తండ్రి చేసే బొమ్మలను అమ్మే ప్రయత్నం చేస్తాడు. అక్కడ అతనికి హాసిని (మృణాళిని రవి) పరిచయం అవుతుంది. అతనిలోని మాటకారితనానికి ఆమె ఫిదా అయిపోతుంది.ఇంతకీ హాసిని ఎవరూ అంటే.. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ స్టార్ హోటల్స్ కు కూరగాయలు సప్లయ్ చేసే వెంకట రమణ (రాజేంద్ర ప్రసాద్) కూతురు. తన కూతురుని చక్కగా ఓ డబ్బున్న వాడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటాడు. ఆమె బొమ్మలు అమ్ముకునే కుర్రాడితో ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమకు చెక్ చెప్పాలనుకుంటాడు వెంకట రమణ. మరో ప్రక్క విజయ్ కు మనికొండ (సునీల్) ప్రొడ్యూసర్ దొరుకుతాడు. ఇప్పుడు విజయ్ ఎలాగైనా తనకు వచ్చిన సినిమా ఆఫర్ తో హిట్ కొట్టి…తను సంపాదన పరుడుని అనిపించుకుని పెళ్లి చేసుకోవాలి. అయితే అతనికి అడ్డం పడేదెవరు పెద్దగా ఎవరూ లేదు. మరి ఈ రెండు పనలు విజయ్ ..విజయవంతంగా చేయగలిగాడా లేదా అనేది మిగతా కథ.

ఇదేమీ కొత్త కథా కాదు..కొత్త పాయింట్ కాదు. ‘’రిచ్ నెస్ అనేది డబ్బులోనో ఆస్తిలోనో వుండదు. అది మనిషి వ్యక్తిత్వంలో వుంటుంది’’అని బలంగా చెప్దామని గ్యాప్ తీసుకుని తయారు చేసుకున్న కథతో ముందుకు వచ్చారు ఎస్వీ కృష్ణారెడ్డి. అయితే ఆయన ఇంటర్వూలలో ట్రెండ్ ని ఫాలో అవుతున్నాని అన్నారు కానీ నిజానికి ఆయన నైంటీస్ ట్రెండ్ నే ఇంకా ఫాలో అవుతున్నారని సినిమా ప్రారంభమైన పది నిముషాలకే అర్దమైపోతుంది. సినిమాలో కథ లేదు..కొన్ని కామెడీ ట్రాక్ లతో సినిమాను లాగే ప్రయత్నం చేసారు. రాజేంద్రప్రసాద్ తో తనకున్న ప్రత్యేక అనుబంధంతో ఆయన సీన్స్ పెంచాలి అనుకున్నారు కానీ కథ ఎటు వెళ్తోంది చూసుకోలేదు. చాలా సింపుల్ స్టోరీ. ఎలాంటి ట్విస్ట్స్ అండ్ టర్న్ లేకుండా ప్లాట్ స్క్రీన్ ప్లే తో చెప్పే ప్రయత్నం చేసారు. రాజేంద్రప్రసాద్ పాత్ర చాలా పాజిటివ్ గా ఉంటుంది. దాంతో ఎక్కడా కాంప్లిక్ట్స్ అనేది పుట్టదు. దాంతో బోర్ కొట్టేస్తుంది.

టెక్నికల్ గా .. ఈ మూవీలో చెప్పుకొ దగ్గ ఎలిమెంట్ , హైలైట్ సి. రాం ప్రసాద్ సినిమాటోగ్రఫీ. పాటలు కూడా బాగున్నాయి. డైలాగ్స్ బాగా పేలాయి. యాక్షన్ కొరియోగ్రఫీ బాగా చేసారు. నిర్మాత కోనేరు కల్పన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే…అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు.. కథ ఎంపిక దారుణంగా ఉంది. దాదాపు పదేళ్ళ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి మూవి ..అంచనాలను ఎక్కడా రీచ్ కాలేదు.

చూడచ్చా
ఓటిటిలలో ఓ లుక్కేయచ్చు కానీ మరీ థియేటర్ కు పనిగట్టుకుని వెళ్లి చూస్తే నిరాశపడతాం.

సునీల్‌, కృష్ణభగవాన్‌, సన, ప్రవీణ్‌, సప్తగిరి, అజయ్‌ఘోష్‌, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు
కెమెరా: సి. రాంప్రసాద్‌,
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి,
ఆర్ట్‌: శివ,
పాటలు: చంద్రబోస్‌, రామజోగయ్య, శ్రీమణి,
సమర్పణ: కె. అచ్చిరెడ్డి,
నిర్మాత: కోనేరు కల్పన,
Runtime:2 hrs
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.
విడుదల తేదీ: 03, మార్చి 2023

Rating:2

Previous articleSantosh Trophy Final: Karnataka to focus on counterattack against suspect Meghalaya defence
Next articleGujarat Open Golf: Anshul Patel shoots 67, rises into joint lead with Aman Raj in round three