ఒకవైపు థియేటర్లో సినిమాలు హంగామా చేస్తున్నా, ఇప్పటికీ అనేక చిత్రాలు డైరక్ట్ గా ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఓటీటీ సంస్థలు సైతం అలాంటి చిత్రాలను కాస్త ఎక్కవ రేటు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాయి. అలా థియేటర్లో విడుదల కావాల్సిన బాలీవుడ్ మూవీ ‘మిషన్ మజ్ను’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ మొదలైంది. ఫిక్షనల్ స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ (Mission Majnu review) యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స్పై ఏజెంట్‌గా సిద్ధార్థ్ బాగున్నాడు అన్నారు. ఈ క్రమంలో రష్మిక నటించిన తొలి బాలీవుడ్ సినిమా ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
విజయ్ సరసన ‘వారసుడు’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న రష్మిక మందన్న ‘మిషన్ మజ్ను’ మూవీలో అంధురాలు (నస్రీన్) పాత్రలో కనిపించింది. టెలీ చక్కర్, బాలీవుడ్ లైఫ్ ప్రకారం, ఈ సినిమాలో తన నటనకు గాను రష్మిక మందన్న రూ. 3 కోట్లు తీసుకుంది. ఈ చిత్రంలో షరీబ్ హష్మీ, కుముద్ మిశ్రా, అర్జన్ బజ్వా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘మిషన్ మజ్ను’లో RAW ఆఫీసర్‌గా నటించిన సిద్ధార్థ్ మల్హోత్రా భారీ పారితోషికాన్ని అందుకున్నాడు.
శంతను బాగ్చీ దర్శకత్వం వహించిన స్పై థ్రిల్లర్ మూవీ ‘మిషన్ మజ్ను’. సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. 70వ దశకంలో అణ్వాయుధ కార్యక్రమాన్ని బహిర్గతం చేసే రహస్య మిషన్‌పై పాకిస్తాన్‌కు వెళ్లే గూఢచారి(అమన్‌దీప్ సింగ్/తారిక్) చుట్టూ తిరుగుతుంది. అనుకోని పరిస్థితుల కారణంగా, తారిక్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? మిషన్ ఎలా సక్సెస్ చేశాడు? అనేదే సినిమా కథ.