‘వినోదాయ చిత్తాం’ రీమేక్.. చాలా కాలంగా ఈ వార్త వినపడుతున్నా ఈ మధ్యనే ఈ చిత్రం ఎనౌన్స్మెంట్ వచ్చింది. టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని (Samuthirakani) ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ క్రేజీ చిత్రం జులై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు అయ్యిందని సమాచారం. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ కేవలం 20 రోజులు మాత్రమే పనిచేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ షూటింగ్ కు బ్రేక్‌లు పడ్డాయి.
అందుకు కారణమం ..ఈ సినిమాకు పవన్ కల్యాణ్ మూడు వారాల కాల్‌షీట్లు వచ్చారని, వరుస కాల్‌షీట్లతో సినిమాలో అతని క్యారెక్టర్ పూర్తవుతుంది అని చెప్పారు కూడా. అయితే ఇప్పుడు పవన్ బ్రేక్‌లు వేస్తున్నారట. మొన్నీమధ్య జనసేన పార్టీ ఆవిర్భావ దినోతవ్సవం కోసం రెండు రోజులు గ్యాప్ ఇచ్చారట. ఆ తర్వాత షూటింగ్ మొదలైనట్లే మొదలై అలసటగా ఉందని కాస్త గ్యాప్ ఇచ్చారట. ఆ తర్వాత ఈ రోజు అంటే శనివారం జరగాల్సిన షూట్‌ను రద్దు చేసుకున్నారని చెబుతున్నారు.
ఇక ఈ సినిమా మాట అంటే పవన్ కల్యాణ్ అభిమానులు చిన్న టెన్షన్ పడుతున్నారు. సినిమా ఎలా ఉంటుంది. పవన్‌కి సరిపోతుందా? అసలు కథ చూస్తుంటే పవన్‌కు పెద్దగా ఉపయోగపడేలా లేదు అని అంటున్నారు. ఈలోపు సినిమా ఉంది? లేదు అనే టాక్ వచ్చేసరికి హమ్మయ్య అనుకున్నారు. ఇంతలోనే సినిమా ప్రారంభం అని అంటున్నారు. మళ్ళీ బ్రేక్ లు అంటున్నారు. దాంతో ఇలా చేస్తే సినిమా ఎప్పుడు పూర్తి చేస్తారా? అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఈ ప్రాజెక్టులో కీ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తున్నాడు. మొత్తానికి ఈ అప్‌డేట్‌పై అఫీషియల్ ప్రకటన రాకున్నా..న్యూస్‌ను మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఈ చిత్రంలో కేతిక శర్మ వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్‌కు ఫైనల్ అయిందని తెలుస్తోండగా..మరో హీరోయిన్ ఎవరనేది క్లారిటీ రావాల్సి ఉంది.