మళ్లీ భాక్సాఫీస్ లెక్క తప్పింది. ఓ పెద్ద సినిమాని మరో పెద్ద సినిమా అనుకరించి బోల్తా కొట్టింది. కన్నడ చిత్రం KGF సూపర్ హిట్ అయిందని దాన్ని దగ్గర పెట్టుకుని దాని లాగే సినిమా చేస్తే అది ఎలా ఉంటుంది. ఆ సినిమాలాగే వర్కవుట్ అవుతుందా.. కన్నడ హీరోలు ఉపేంద్ర, సుదీప్ లు ఆ కేజీఎఫ్ ఫార్ములానే నమ్మి డేట్స్ ఇచ్చినట్లున్నారు. డైరక్టర్ అదే టెక్నీషియన్స్ లేదా అలాంటి అవుట్ పుట్ ఇచ్చేవాళ్లను తీసుకొచ్చి మరో కేజీఎఫ్ అనిపించే ప్రయత్నం చేసారు. అలాంటి సేట్ టు సేమ్ ఎలివేషన్స్ తో అచ్చం KGF లానే తీశారు. అక్కడితో ఆగకుండా KGF సినిమాలు వాడిన లొకేషన్స్, అవే కెమెరా ఫ్రేమ్స్, అదే వాయిస్ ఓవర్ నేరేషన్, కొన్నిచోట్ల అదే KGF మ్యూజిక్, అదే గన్స్, ఫైట్స్.. ఇలా సినిమా మొత్తం కూడా అచ్చం KGF లానే అనిపించేలా ప్లాన్ చేసారు. అందుకు కారణం KGF మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించడం కూడా కావచ్చు. అయితే డైరక్టర్ పూర్తిగా కేజీఎఫ్ అనేస్తారని…. కథ మాత్రం వేరేది తీసుకున్నారు.

లేకపోతే KGF రీమేక్ సినిమా చూసినట్టు అయ్యేది. ఎవరెన్ని చేసినా అనుకరణ.. అనుకరణే.. ఒరిజనల్.. ఒరిజనలే. ఎన్ని చేసినా KGF లాగా కథ, కథనంలో స్ట్రాంగ్ లేకపోవడంతో ప్రేక్షకులని మెప్పించలేని పరిస్దితి. ‘కబ్జా’ టీమ్ ఆ విషయంలో పూర్తిగా ఫెయిలైందనే చెప్పాలి. ప్రారంభం సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు ఒక్క చోట కూడా ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయలేకపోవటం దురదృష్టం. ఏదైమైనా రచయిత, దర్శకుడు చాలా రిసెర్చ్ చేసి కంటెంట్ తయారు చేస్తేనే ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లగలుగుతారు. అదే ఆ కంటెంట్ కి సహజత్వాన్ని తీసుకొస్తుంది. అది చేతకానప్పుడు కాపీ కొట్టే విషయంలో అయినా దర్శక రచయితలు బాగా రీసెర్చ్ చేస్తే బాగుండేది. రైటర్ అండ్ డైరెక్టర్ ఆర్. చంద్రు ఆల్రెడీ ఉపేంద్రతో రెండు సినిమాలు చేశారు. ‘కబ్జా’ తో హ్యాట్రిక్ కొట్టాలనుకున్నారు. కానీ అది జరిగేలా కనిపించట్లేదు. అలాగే ‘కబ్జా’ కు సీక్వెల్ ఉందని చెప్పి క్లైమాక్స్ ని ముగించారు. చూడాలి మరి దాన్ని ఎలా తీస్తారో? ఇంతకీ ఈ చిత్రం కథేమిటంటే..

స్వతంత్రం రాక ముందు రోజుల్లో ఓ స్వతంత్ర పోరాట యోధుడిని బ్రిటిష్ వాళ్ళు చంపేసి, అతడి రాజ్యాన్ని నాశనం చేస్తారు. దాంతో అతని భార్య, పిల్లలు అనాథలవుతారు. వేరే దారి లేక తాము ఉన్న నార్త్ ఇండియా ని వదేలిసి సౌత్ లోని మరో రాజ్యానికి వెళ్తారు. అలా వలస వచ్చిన పిల్లల్లో ఒకరు ఆర్కేశ్వర్ (ఉపేంద్ర). చిన్నప్పటి నుంచి భయంతో కాస్తంత అమాయకత్వంలో పెరిగి, స్వతంత్రం వచ్చాక ఉపేంద్ర ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అవుదాం అనుకుంటాడు. అదే సమయంలో అతను అన్న మాఫియా వాళ్ళు చేసిన పనికి ఎదురు నిలబడి ఓ మాఫియా లీడర్ కొడుకుని చంపేస్తాడు. దీంతో వాళ్లు ఆగకుండా ఉపేంద్ర అన్నని చంపేస్తారు. తన అన్నని చంపేశారని కోపంతో ఉపేంద్ర వాళ్ళని వరస చంపుకుంటూ వెళ్తాడు. అలా తన ప్రమేయం లేకుండానే తన పగ కోసం, తన కుటుంబం కాపాడుకోవడానికి మర్డర్స్ చేస్తూ పెద్ద మాఫియా లీడర్ గా మారుతాడు. ఇదిలా ఉంటే మరో పక్క చిన్నప్పట్నుంచి తాము వలస వెళ్లిన అమరాపురం రాకుమారి (శ్రియ) తో ప్రేమలో పడతాడు. ఆ రాజ సంస్థానం వాళ్ళు అతనితో పెళ్లికి నో చెప్తారు. అప్పుడు ఏమైంది.. మాఫియాలోంచి ఉపేంద్ర బయటకు రాగలగాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఓ జనరేషన్ కు బాగా గుర్తు A, ఓం, ఉపేంద్ర వంటి ఉపేంద్ర సినిమాలు కల్ట్ క్లాసిక్ గా మిగిలి పోయాయి. అలాగే ఈ మధ్యన ఆయన తెలుగులో ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘గని’ వంటి చిత్రాలలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. ఆ తర్వాత ఆయన హీరో గానూ, దర్శకుడు గానూ స్పీడు తగ్గించారు. అయితే తాజాగా ఈ కబ్జా చిత్రం వచ్చి ఆశ్చర్యపరిచింది. ఉపేంద్ర మాత్రం తన వంతుగా ఎప్పటిలాగే బాగా చేసారు. సుదీప్ గెస్ట్ కాబట్టి పెద్దగా చెప్పుకునేదేం లేదు. దర్శకత్వం విషయానికి చాలా దారుణంగా అనిపిస్తుంది. సీన్స్ వస్తూంటాయి. పోతూంటాయి . ఎక్కడా సస్టైన్ చేయరు. ఎక్కడా పాయింటాఫ్ ఇంట్రస్ట్ కూడా ఉండదు.

చూడచ్చా..
‘కేజీయఫ్’ చూడకుండా ‘కబ్జ’ ను ఫ్రెష్ ఫీల్‌తో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. చూసి ఉంటే మాత్రం… తిట్టుకుంటూ బయిటకు వస్తారు
నటీనటులు: ఉపేంద్ర, సుదీప్, శివరాజ్ కుమార్, శ్రియ, సుధ, మురళీ శర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ: అర్జున్ శెట్టి
సంగీతం: రవి బస్రూర్
నిర్మాతలు: ఆనంద్ పండిట్, ఆర్.చంద్రు, అలంకార్ పాండియన్
రచన, దర్శకత్వం: ఆర్. చంద్రు
Run time: 2 గంటల 16 నిముషాలు
విడుదల తేదీ: మార్చి 17, 2023
Rating:2