ఇటీవల కాలం ఎయిరిండియా సంస్థ అడపాదడపా విమర్శలకు గురవుతోంది. తాజాగా నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్‌కు చేదు అనుభవం ఎదురైంది. చెన్నై ఎయిర్ పోర్టులో వీల్ చైర్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఇటీవల ఆమె మోకాలికి గాయమైంది. ఈ రోజు చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ఆమె వీల్ చైర్ కోసం ఎదురు చూశారు.
కానీ అరగంట తర్వాత ఎయిర్ పోర్టు సిబ్బంది వీల్ చైర్ తీసుకుని వచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఎయిర్ ఇండియా సంస్థపై ఆమె మండిపడ్డారు. డియర్ ఎయిరిండియా మోకాలి గాయంతో బాధపడుతున్న ప్రయాణికురాలిని లోపలికి తీసుకు వెళ్లేందుకు మీ దగ్గర కనీసం ఓ వీల్ చైర్ కూడా లేదన్నారు.
కాలికి కట్టుతో ఉన్న తాను విమానాశ్రయంలో 30 నిమిషాల పాటు వేచి చూడాల్సి వచ్చిందని ఆమె వాపోయారు. మరో ఎయిర్ లైన్స్ నుంచి మీ సిబ్బంది వీల్ చైర్ తీసుకుని వచ్చి తనను తీసుకు వెళ్లారని ఆమె అన్నారు. ఎయిర్ ఇండియా సంస్థ మరింత మెరుగ్గా సేవలు అందించగలదని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.
‘డియర్ ఎయిరిండియా..మోకాలి గాయంతో బాధపడుతున్న ప్రయాణికురాలిని తీసుకు వెళ్లేందుకు మీ దగ్గర కనీసం వీల్ చైర్ కూడా లేదు. లెగ్మెంట్ గాయంతో కట్టుతో ఉన్న నేను చెన్నై విమానాశ్రయంలో 30 నిమిషాల పాటు వేచిచూడాల్సి వచ్చింది. మీ సిబ్బంది మరో ఎయిర్‌లైన్ నుంచి వీల్‌చైర్ తీసుకు వచ్చి నన్ను తీసుకువెళ్లారు. మీరు మరింత మెరుగ్గా సేవలు అందించగలరని ఆశిస్తున్నాను” అని ఖుష్బూ ట్వీట్ చేశారు. ఖుబ్భూ ట్వీట్‌కు మద్దతుగా పలువురు ట్వీట్లు చేశారు. దీనిపై ఎయిరిండియా సంస్థ నిర్వాహకులు వెంటనే కుష్బూకు క్షమాపణలు తెలిపింది. ”మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. వెంటనే ఈ విషయాన్ని చెన్నై విమాన నిర్వాహకులకు తెలియజేస్తాం” అని ఎయిర్‌లైన్ ట్వీట్ చేసింది.
ఖుబ్భూ ట్వీట్ కి పలువురు మద్దతు తెలుపుతూ పోస్టులు చేశారు. దీంతో ఎయిర్ ఇండియా కుష్బూకు క్షమాపణలు చెప్పింది. ఆమెకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. వెంటనే ఈ విషయాన్ని చెన్నై విమాన నిర్వాహకులకు తెలియజేస్తామని చెప్పింది.