Home Telugu OTT ఒకే రోజు OTT లోకి 18 సినిమాలు.. ఏది చూడాలరా దేవుడా?

ఒకే రోజు OTT లోకి 18 సినిమాలు.. ఏది చూడాలరా దేవుడా?

9
0
Reading Time: < 1 minute

శుక్రవారం వస్తోందంటే.. గతంలో థియేటర్ల వద్ద సందడి ఎక్కువ ఉండేది. ఇప్పుడు థియేటర్స్ లో కంటే ఓటీటీలోనే ఎక్కువ సందడి కనిపిస్తోంది. కుప్పలు తెప్పలుగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రేపు ఒక్క రోజే ఓటీటీలో పద్దెనిమిది సినిమాలు రిలీజ్ కాబోతోన్నాయి. అవడానికి పద్దెనిమిది సినిమాలున్నా కూడా అందులో మూడు నాలుగు సినిమాలే కాస్త చెప్పుకోదగ్గవి ఉన్నాయి. అందరి దృష్టీ ధనుష్ సార్, సుహాస్ రైటర్ పద్మభూషణ్ సినిమాలపై నే ఉంది. ఇక ఆహాలో, జీలోనూ కొత్త సినిమాలు వస్తున్నాయి.

ఇక ధనుష్‌ నటించిన సార్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి హిట్‌గా నిలిచింది. తమిళంలో వాతి అంటూ రిలీజ్ కాగా.. ఈ సినిమా ఏకంగా వంద కోట్లను కొల్లగొట్టేసింది. ఇలా క్లాస్ సినిమాతోనూ మాస్ కలెక్షన్లను రాబట్టేశాడు ధనుష్. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ మీద కూడా అందరి దృష్టి పడింది. నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా రేపటి నుంచి అందుబాటులోకి రాబోతోంది.

సుహాస్‌కు కలర్ ఫోటో తరువాత డిమాండ్ పెరిగింది. హీరోగానూ ఆఫర్లు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రైటర్ పద్మభూషణ్ అంటూ అందరినీ మెప్పించాడు. ఈ చిత్రం చిన్నగా మొదలై పెద్ద సునామినే క్రియేట్ చేసింది. ఈ సినిమాకు వసూళ్లతో పాటుగా ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ చిత్రం జీ5లో రేపటి నుంచి సందడి చేయనుంది.

ఇవి ఇలా ఉంటే.. ఆహాలో కొత్త ప్రాజెక్ట్ రాబోతోంది. పుష్ప ఫేమ్ కేశవ హీరోగా ఈ సినిమా రెడీ అయింది. సత్తిగాని రెండెకరాలు అంటూ రాబోతోన్న ఈ మూవీ టీజర్, ట్రైలర్ బాగానే ఆకట్టుకున్నాయి. రేపటి నుంచి ఆహాలో సత్తిగాని రెండెకరాలు స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్‌లో కాట్ అవుట్ క్రైమ్, కరప్షన్, క్రికెట్, కుత్తే, ది మెజీషియన్స్ ఎలిఫెంట్, నాయిస్ రాబోతోన్నాయి.

పునీత్ రాజ్ కుమార్ చివరగా నటించిన గందద గుడి సినిమా రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో రాబోతోంది. డామ్ అనే మరో సినిమా అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక సోనీలివ్‌లో రాకెట్ బాయ్స్ అనే సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Previous articleరీరిలీజ్ కోసం ‘మగధీర’ ని మానేసి ముంచేసిన సినిమాని ముందుకు
Next articleIPL 2023: Mumbai Indians will have a point to prove after last year’s performance, says Sunil Gavaskar