Home TelanganaTv డిఫరెంట్ కథల డైరక్టర్ తో రవితేజ చిత్రం?

డిఫరెంట్ కథల డైరక్టర్ తో రవితేజ చిత్రం?

5
0
Reading Time: < 1 minute

మాస్ మహారాజా రవితేజ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గత కొంతకాలంగా ఊహించని స్థాయిలో భారీ డిజాస్టర్ ఎదుర్కొంటున్న ఆయన పామ్ లోకి వచ్చేసాడు. గతంలో కిక్ 2 సినిమా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చడంతో ఆ తర్వాత రవితేజ కెరీర్ కష్టమే అనేలాగే అతని మొహం కూడా చాలా వరకు మారిపోయింది. బక్కగా అయిపోవడంతో అతను మళ్ళీ హీరోగా నిలదొక్కుకోవడం కూడా కష్టమే అని చాలామంది కామెంట్ కూడా చేశారు. కానీ రవితేజ మాత్రం అందుకు భిన్నంగా హిట్స్ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు.

ఇటీవల కాలంలో ఏం మీడియం రేంజ్ హీరో అందుకొని విధంగా అతనికి బాక్సాఫీస్ కలెక్షన్స్ వస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొత్తానికి మోస్ట్ కమర్షియల్ సినిమా గా వచ్చిన ధమాకా సినిమా అతని కెరీర్ లోనే నెంబర్ వన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని ఇప్పుడు అతడి కెరీర్ లోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. సంక్రాంతి రేసులో చిరంజీవితో కలిసి వాల్తేర్ వీరయ్య సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటికే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు భారీ కలెక్షన్స్ ని రాబడుతోంది. మొదటి రోజే 40 కోట్ల వరకు గ్రాస్ ని వాల్తేర్ వీరయ్య రాబట్టింది. ఇక ఈ మూవీకి వస్తున్న పాజిటివ్ బజ్ తో చూస్తూండగానే 200 కోట్ల క్లబ్ లో చేరిపోతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ మరింత స్పీడు పెంచారు. ఆయన మరో సినిమా ఓకే చేసారు.

అందుతున్న సమాచారం మేరకు.. రవితేజ, ప్రశాంత్ వర్మ కాంబోలో మూవీకి రంగం సిద్ధం అవుతోంది. విలక్షణమైన కథలు, కథనానికి పెట్టింది పేరైన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఇద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నాయి. జాంబిరెడ్డి, కల్కి లాంటి డిఫరెంట్ మూవీస్ తీశాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం తేజ సజ్జ హీరోగా హనుమాన్ అనే మైథలాజికల్ ఫాంటసీ సూపర్ హీరో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత రవితేజ తో కలిసి సెట్స్ పైకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు రవితేజను ఎవ్వరూ చూపించని డిఫరెంట్ షేడ్ లో ప్రజెంట్ చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈగల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు రవితేజ. త్వరలోనే ప్రశాంత్ వర్మ ప్రాజెక్టుపై క్లారిటీ వస్తుంది.

Previous articleబాలయ్యకు నాగచైతన్య, అఖిల్ షాకింగ్ కౌంటర్
Next articleDGCA imposes Rs 10L fine on Air India for not reporting two incidents on Paris-New Delhi flight