Home TelanganaTv ట్రేడ్ కు షాక్ ఇస్తున్న ‘పఠాన్’ అడ్వాన్స్ బుక్కింగ్ లు

ట్రేడ్ కు షాక్ ఇస్తున్న ‘పఠాన్’ అడ్వాన్స్ బుక్కింగ్ లు

5
0
Reading Time: < 1 minute

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన పఠాన్ సినిమా జనవరి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి. పఠాన్ సినిమా దేశవ్యాప్తంగా కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. హైదరాబాద్ నగరంలో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు ఒక టాక్ వినిపిస్తోంది. అన్ని ఏరియాల కంటే ముందుగానే హైదరాబాదులో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక సినిమా ఇప్పటివరకు హైదరాబాద్ లోనే రెండు కోట్ల మార్క్ ను అందుకోవడం విశేషం. గతంలో వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఈ సినిమా బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో వచ్చిన పెద్ద సినిమాల కంటే ఎక్కువ స్థాయిలోనే పఠాన్ సినిమా అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. సినిమా విడుదలకు ఇంకా మూడు రోజుల సమయం ఉన్నప్పటికీ హై రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఏరియాలో కూడా ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి.

పఠాన్ సినిమా టాప్ 3 అడ్వాన్స్ బుకింగ్ నేషనల్ చైన్ వైస్ గా చూసుకుంటే మాత్రం అత్యధిక స్థాయిలో టికెట్లు అమ్ముడైన సినిమాగా నిలిచే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. మొదటి రోజు ఈ రికార్డులో ఇప్పటివరకు కేజిఎఫ్ సెకండ్ పార్ట్ కు 5.15 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక తర్వాత బ్రహ్మాస్త్రకు 3.02 లక్షల టికెట్లు అమ్ముడవగా అది రెండో స్థానంలో ఉంది. ఇక ఇప్పుడు పటాన్ సినిమా 2.65 లక్షల టికెట్లను అమ్ముకుంది. ఇంకా మూడు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఓపెనింగ్స్ లో అయితే ఈ సినిమాకు 40 నుంచి 50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక గురువారం రోజు 50 నుంచి 52 కోట్లు కూడా రావచ్చు.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ పఠాన్ సినిమాను నిర్మిస్తోంది. ఇది ఈ బ్యానర్‌లో వస్తున్న 50వ చిత్రం. ఆదిత్యా చోప్రా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకుణే హీరో, హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ ఏకకాలంలో విడుదల కానుంది.

Previous article‘వాల్తేరు వీరయ్య’ రివ్యూ రేటింగ్స్ పై చిరు సెటైర్స్
Next articleIssue appointment order of IPS officer Rupin Sharma as DGP, SC tells Nagaland