వయస్సుతో సంభందం లేకుండా క్రేజ్ ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన కొత్త సినిమా అంటే చిన్నా పెద్దా తేడా లేకుండా చర్చ మొదలైపోతుంది. డైరక్టర్ ఎవరు, కథేంటి,హీరోయిన్ ఎవరూ అంటూ జనం ఆసక్తి కనిపిస్తారు. అదే విధంగా …రజనీకాంత్ 169వ చిత్రంపై సినీ అభిమానుల్లో గత కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. ‘డాక్టర్’ ఫేం నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారంటూ వార్తలొచ్చాయి. దీనిపై క్లారిటీ వచ్చింది.
రజనీకాంత్- నెల్సన్ కాంబినేషన్లో సినిమాని రూపొందిస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో నెల్సన్, రజనీకాంత్, సంగీత దర్శకుడు అనిరుధ్ స్టైలిష్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
‘రోబో’ తర్వాత తెలుగులో తలైవా ఏ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించలేదు. గతేడాది దీపావళి కానుకగా విడుదలైన ‘పెద్దన్న’ మూవీ అంతగా ఆకట్టుకోలేక పోయారు. ఇక ఈ సినిమా తమిళంలో ‘అన్నాత్తే’గా విడుదలైంది. తమిళనాడులో రజినీకాంత్ క్రేజ్‌తో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. శివ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్లో కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించింది. అంతేకాదు అక్కడ పెద్దగా బాక్సాఫీస్ దగ్గర పర్పామ్ చేయలేదు. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమా డిజాస్టర్ అయింది.