ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర
చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. కాలభైరవ, మిత్రబింద క్యారెక్టర్స్ తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటికి, ఎప్పటికి చిరస్థాయిగా మిగిలిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తే ఎంత బాగుండు అని చాలామంది అభిమానులు అనుకుంటున్నారు. అది నెరవేరే రోజు త్వరలోనే రానుందని వార్తలు వచ్చాయి. ‘మగధీర’ మూవీని మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అవనుంని ప్రకటించారు. ఈ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ సినిమా రీ రిలీజ్ ఆగిపోయిందని సమాచారం. అందుతున్న సమచారం.
అయితే రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఆరెంజ్ సినిమాకు నాగబాబు నిర్మాత. రీ రిలీజ్ విషయంలో ఎలాంటి అడ్డంకులు కూడా ఉండవు. వచ్చిన మొత్తాన్ని జనసేనకు విరాళంగా ఇవ్వాలని భావిస్తున్నారట. అందుకే ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అందులోనూ ఆరెంజ్ సినిమా ఇప్పుడు వస్తే హిట్ అవుతుందని అంతా అంటారు. దీంతో ఆరెంజ్ సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారా? అని అంతా అనుకుంటున్నారు. పాటలు అయితే ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే నిలిచి ఉంటాయని తెలిసిందే.
ఏదైమైనా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మగధీర
ని ప్రక్కన పెట్టేయటం చాలా మందికి నచ్చటం లేదు. ఈమూవీ రామ్ చరణ్ కు స్టార్ హీరో ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ్ముడు, జల్సా సినిమాలను రిలీజ్ చేశారు. వాటికి వచ్చిన కలెక్షన్లను జనసేనకు విరాళంగా ఇచ్చారు. ఇక న్యూ ఇయర్ స్పెషల్‌గా ఖుషి సినిమాను రిలీజ్ చేస్తే ఏకంగా వారం రోజులు ఆడేసింది. పది కోట్ల గ్రాస్ కొల్లగొట్టేసినట్టుంది. అయితే మధ్యలో బాలయ్య చెన్నకేశవ రెడ్డిని కూడా రీ రిలీజ్ చేశారు. కానీ అంతగా ఆడలేదు. చిరంజీవి గ్యాంగ్ లీడర్ సైతం అంతగా ఆకట్టుకోలేకపోయింది.