టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అన్నాడు. విరాట్ కోహ్లీ తనకు ఆదర్శమని ఈ గ్లోబల్ స్టార్ వెల్లడించాడు. ఇక క్రికెటర్లు, రాజకీయ నేతలు, సినీ స్టార్ల జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన బయోపిక్‌లు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ జీవితాలపై నిర్మించిన బయోపిక్స్ అభిమానుల మనసులను గెలుచుకున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఎవరి బయోపిక్‌లోనైనా నటించాలనుందా? అని రామ్ చరణ్‌ను ప్రశ్నించగా.. మరో ఆలోచన లేకుండా విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరు చెప్పాడు. ‘నేను చాలా రోజులుగా స్పోర్ట్స్ బేస్డ్ మూవీలో నటించాలని భావిస్తున్నా. అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటిస్తా. ఎందుకంటే విరాట్ కోహ్లీని నేను స్పూర్తిగా తీసుకుంటాను. అతని బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోను’అని ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2022 కార్యక్రమంలో రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయాడు చెర్రీ. దీనికి ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారం కూడా రావడంతో చరణ్ క్రేజ్ ఇప్పుడు నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. ఇదిలా ఉంటే ఆస్కార్ వేడుక నుంచి ఇండియా వచ్చిన చరణ్ ఢిల్లీలో జరిగిన ఓ ప్రైవేట్ ఛానల్ ఎన్‌క్లేవ్‌లో పాల్గొన్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ముఖ్యంగా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు చెర్రీ. ఆర్‌సీ 15 (వర్కింట్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. దీని తర్వాతి ప్రాజెక్టులపై కాన్ క్లేవ్ వేదికగా స్పందించాడు రామ్ చరణ్ . ముఖ్యంగా టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బయోపిక్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ప్రస్తుతం చరణ్ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. రామ్ చరణ్ హీరోగా కోహ్లీ బయోపిక్ తెరకెక్కితే భారీ హిట్ కొట్టడం ఖాయమని ఇటు చరణ్ అభిమానులు, ఇటు కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.