Home TelanganaTv రిలీజ్ కు ముందే రివ్యూలు, ఓపినింగ్స్ తెచ్చిపెడతాయా ?

రిలీజ్ కు ముందే రివ్యూలు, ఓపినింగ్స్ తెచ్చిపెడతాయా ?

10
0
Reading Time: < 1 minute

చాలా కాలం గ్యాప్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన తాజా చిత్రం రంగమార్తండ. చాలా గ్యాప్ తర్వాత ఆయన తెరకెక్కించిన ఈ మూవీ పై ఇప్పటికే అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మనందం ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన సినీ ప్రముఖులు సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. నటీనటులు.. కృష్ణవంశీ టేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరి హృదయాలను కృష్ణవంశీ టచ్ చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ, డిస్ట్రీబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కొన్నట్లు తెలుస్తోంది. దీంతో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 22న గ్రాండ్‌గా విడుదలకానుంది.

ఇప్పటివరకూ బయటికి వచ్చిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రివ్యులు కూడా జరిగాయి. ఈ సినిమా చూసిన వాళ్ళంతా కృష్ణ వంశీ ఈజ్ బ్యాక్ అంటున్నారు. ప్రతి ఒక్కరూ కన్నీళ్లు వచ్చేశాయి అంత మంచి ఎమోషన్స్ వున్నాయని చెబుతున్నారు. మంచి మెసేజ్ , కన్నీళ్ళు, గుండెతడి, ఆర్ద్రత, మనసుని కదిలించే సన్నివేశాలు ఉన్నాయంటూ సినిమాని మెచ్చుకుంటున్నారు ప్రివ్యూ ఆడియన్స్. ఇలాంటి సినిమాలను జనాలను థియోటర్ కు వెళ్ళి ఆదరిస్తున్నారా లేక ఓటిటిలో చూద్దామనుకుంటున్నారా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

ఈ రంగమార్తాండ ఓ మరాఠి క్లాసిక్ సినిమా ‘నట సమ్రాట్’ మూవీకి రీమేక్‌గా వస్తోంది. అక్కడ నానా పాటేకర్ ముఖ్యపాత్రలో నటించారు. కృష్ణవంశీ చిత్రాన్ని అన్ని విధాలా గొప్పగా ఉండేలా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రఖ్యాత సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల విషయానికి వస్తే… ఒరిజినల్ చిత్రం నటసామ్రాట్‌లో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత బ్రహ్మనందం కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

Previous articleకోహ్లీ బయోపిక్ లో చేస్తానంటూ చరణ్, ఆనందంలో ఫ్యాన్స్
Next articleఉపేంద్ర “కబ్జ” కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి.?