పురాణాల్లో దుర్వాస మహర్షికు ప్రత్యేక స్దానం. దుర్వాస మహర్షికి కోపం చాలా ఎక్కువ. క్షణాల్లో శపించేస్తాడు. ఆ కోపం చల్లారిన తరువాత శాపానికి విరుగుడు చెబుతాడు. శకుంతలని శపించి ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది దుర్వాస మహర్షే. తెరపై ఈ పాత్ర కనిపించేది కాసేపే అయినప్పటికీ.. ఇంపాక్ట్ ఉండాలనే కారణంతో మోహన్ బాబుని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.
గుణశేఖర్ చేస్తున్న సినిమా శాకుంతలమ్
. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. శకుంతలగా…. సమంత నటిస్తోంది. సమంతనే ఈ సినిమాకి సేలబుల్ పాయింట్. అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది గుణశేఖర్ ప్లాన్. ఈరోజే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అభిజ్ఞాన శాకుంతలంలో.. శకుంతల పాత్ర ఎంత కీలకమో… దుర్వాస మహర్షి పాత్ర కూడా అంతే కీలకం. ఈ పాత్రని ఇప్పుడు మోహన్ బాబు పోషిస్తున్నారు.
గుణశేఖర్ డైరెక్షన్ వహించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో దేవ్ మోహన్, మోహన్బాబు, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. వీరితోపాటుగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా బాలనటిగా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం చిత్ర టీమ్ ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.
దాంట్లో భాగంగా గానే ఇప్పటికే ప్రమోషన్స్ ని షురూ చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మోహన్బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో మోహన్ బాబు దుర్వాస మహర్షి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. మహర్షిగా ఆయన లుక్ అదిరిపోవడంతో పాటు లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. రేపు అనగా మార్చి 19వ తేదీన మోహన్ బాబు పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా రెండు రోజుల ముందే మోహన్ బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.
శకుంతల, దుష్యంత్ ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, గుణా టీమ్ వర్క్ పతాకాలపై దిల్రాజు, నిలిమా గుణ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని సమంత అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ సినిమాని విజువల్ వండర్గా తీర్చిదిద్దారు దర్శకుడు గుణశేఖర్. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. విడుదలైన పాటలు వినసొంపుగా, అద్భుతంగా ఉన్నాయి. ఐతే ఈ సినిమా వచ్చే నెల ఏప్రిల్ 14న విడుదల కానుంది.