అల్లు అర్జున్ తో చేసిన ‘అల వైకుంఠపురం’ తర్వాత త్రివిక్రమ్ దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని మహేష్‌తో ‘SSMB28’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసికల్ హిట్ల తర్వాత వీళ్ళ కాంబోలో మూడో సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపే మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూయటంతో బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ కొన్ని రోజులు షూటింగ్‌ను ఆపేశారు. కాగా డిసెంబర్ రెండు లేదా మూడో వారం నుండి తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు చిత్ర టీమ్ సన్నాహాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మరింత లేటు అయ్యేలా కనపడుతోంది. అందుకు కారణం పూజ హెడ్గే అంటున్నారు.
ఆమె డేట్స్ వేరే సినిమాలకు కేటాయించి ఉండటం వల్ల లేటు అవుతోందని తెలుస్తోంది. అయితే ఈ లోగా మిగతా పనులు ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేసారు త్రివిక్రమ్. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ దుబాయిలో మొదలు కానున్నాయి.ఓ వారం పాటు మహేష్ బాబు, తమన్ కలిసి ఈ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారు. మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ముంబై నుంచి దుబాయ్ కి ప్రయాణమయ్యారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌ను ఎంపిక చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇదే గనుక నిజమైతే సైఫ్ అలీఖాన్‌కు తెలుగులో ఈ చిత్రం రెండవది అవుతుంది. ఇక సైఫ్ అలీఖాన్, ప్రభాస్‌తో కలిసి ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘SSMB28’ చిత్రాన్ని హారిక& హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు. మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. శ్రీలీల సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడట.