సాయి తేజ్ మరియు పవన్ కళ్యాణ్ కలిసి ఒక మెగా మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన “వినొదయ సితం” అనే సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనుండగా సాయి తేజ్ మనిషి పాత్రలో కనిపించనున్నారు. అయితే రాజకీయ పనులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక షెడ్యూల్ కి 20 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈ వారం నుంచే షూటింగ్ మొదలు కానుంది. అందుకే సాయి తేజ్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి ప్రస్తుతం తాను చేస్తున్న చిత్ర నిర్మాతలను సంప్రదించి విషయాన్ని తెలిసి ఈ సినిమా నుంచి 20 రోజుల బ్రేక్ తీసుకున్నారట.
దీనికి సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రను కూడా చేశారు. ఇప్పుడాయనే తెలుగులోకి ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నారు. దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా నెలకొన్నాయి. పవర్ స్టార్ మరికొన్ని ప్రాజెక్టులు ప్రకటించడంతో ఈ మూవీ చేయరని అంతా అనుకున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మల్టీస్టారర్ మూవీని ఈ వారం నుంచే మొదలు పెట్టబోతున్నారట. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన సెట్ వర్క్ కూడా పూర్తైనట్లు తెలిసింది. మొదటి షెడ్యూల్లోనే పవన్ పాల్గొంటాడనే టాక్ వినిపిస్తోంది. ఇదంతా ఎంతో సీక్రెట్‌గా ప్లాన్ చేశారని సమాచారం.
ప్రస్తుతం పవన్ కల్యాణ్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. దీనితో పాటు హరీష్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీని చేయనున్నాడు. అలాగే, సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మరో చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశాడు.