టాక్సీ ఎక్కిన ఇద్దరి వ్యక్తుల జీవితాలను వారి గతం ఎలా వెంబడించింది…ఒకరికొకరు తెలియకుండా టాక్సీ ఎక్కినా…వాళ్లిద్దరు ఒకరికొకరు ఎలా ఇంటర్ లింక్ అయ్యి ఉన్నారు వంటి ఆసక్తికరమైన ట్విస్ట్ లు రాసుకుని తెరకెక్కించిన చిత్రం ఇది. సినిమాలో కంప్లైంట్లు ఉన్నాయి. కాకపోతే యాక్షన్ సీన్లు, ఎంచుకొన్న లొకేషన్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివాటితో చాలా భాగం ఆ లోటు తెలియకుండా… కాలక్షేపం అయిపోతుంది. ఇంట్రవెల్ ట్విస్టు బాగుండడంతో… మరీ తీసిపారేసే సినిమా కాదు అనిపిస్తుంది. ఆ తర్వాత సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ విషయాలు రివీల్ అయ్యేటప్పుడు స్లో అయ్యినట్లు ఉంటుంది. అయితే ఆ క్రమంలో వచ్చ ట్విస్ట్ బాగుంటుంది. సినిమా కథగా బాగుంటుంది. కానీ కొత్త ఆర్టిస్ట్ లతో చూసినప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంతకీ ఆ కథేంటి అంటారా..
ఈశ్వర్ (వసంత్ సమీర్ పిన్నమ రాజు) ఓ యంగ్ సైంటిస్ట్. అతను కాలిఫోర్నియం 252 పై ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతాడు. కాలిఫోర్నియం 252 తో బంగారం నిల్వలు కనిపెట్టవచ్చు. ఎక్కడో భూమి లోతుల్లో ఉన్న బంగార నిల్వల అంతు తేల్చచ్చు. అప్పుడు మన దేశం నెంబర్ వన్ అవుతుంది అని ఆశింతి గనుల శాఖా మంత్రి ముందు ప్రపోజల్ పెడతాడు. మరిన్ని ప్రయోగాలు కోసం సెంటర్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వమని అడుగుతాడు. అయితే కాలిఫోర్నియం 252 ఒక్కో గ్రాము 180 కోట్లు. అంతటి విలువైన సంపదను ఎవరు వదులుకుంటారు. పొలిటీషన్స్, వారిని అంటిపెట్టుకునే మాఫియా రంగంలోకి దూకుతుంది. ఈశ్వర్ లాంటి నిజాయితీ పరుడుని వంచటం కష్టం. అందుకే అతని పర్శనల్ లైఫ్ ని తమ గుప్పిట్లో తీసుకుంటే అనే ఆలోచన వస్తుంది. అక్కడ నుంచి ఈశ్వర్ పై నేరారోపణలు, అతని భార్య (అల్మాస్ మోటివాలా) మిస్సింగ్ లు జరిగిపోతూంటాయి. వాటి నుంచి ఈశ్వర్ తప్పించుకోవటానికి తన వంతు ప్రయత్నం మొదలెడతాడు.

మరో ప్రక్క ఎథికల్ హ్యాకర్ ఉజ్వల్ (సూర్య శ్రీనివాస్) కు కెరీర్ పరంగా ఎదటానికి మంచి కాంట్రాక్ట్ వస్తుంది. దాంతో స్నేహితులు,సన్నిహితులు నుంచి అప్పులు చేసి తెచ్చి మరీ తన సంస్దను డవలప్ చేస్తూ పై మెట్టు ఎక్కాలనుకుంటాడు. కానీ అనుకోని విధంగా తనకు వచ్చిన కాంట్రాక్ట్ సమస్యల్లో పడటం, ప్రాజెక్టు ఆగిపోవటం, చివరకు అప్పులు మిగలటం జరుగుతుంది. ఆ ఫైనాన్సియల్ ప్రెజర్ తట్టుకోవటానికి అతను ఓ డెసిషన్ తీసుకుంటాడు. ఇలా వేర్వేరు సమస్యలతో ఉన్న ఈశ్వర్, ఉజ్వల్ అనుకోని పరిస్దితుల్లో ఓ క్యాబ్ ఎక్కుతారు. ఆ క్యాబ్ పై కొందరు ఎటాక్ చేస్తారు. వాళ్లనుంచి తప్పించుకున్న వీళ్లిద్దరు తమపై ఎటాక్ కు ప్లాన్ చేసింది విద్యుత్ (నవీన్ పండిత) అని తెలుసుకుంటాడు. అతనెవరు..వీళ్లిద్దరని టార్గెట్ చేయటానికి కారణం ఏమిటి… ఎటాక్ జరిగిన తర్వాత నుంచి వాళ్ల జీవితాలు ఎలా టర్న్ తీసుకున్నాయి. మిస్సైపోయిన ఈశ్వర్ భార్యతిరిగి కనపడిందా..అతనిపై పడిన పోలీస్ కేసులు,నేరారోపణలు చివరకు ఏమయ్యాయి ..ఈ కథలో టాక్సీ డ్రైవర్ ( సద్దాం హుస్సేన్) పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే..ఫస్ట్ హాఫ్ వరకు హీరోని సమస్యలో పడేయటం….. సెకండ్ హాఫ్ లో ఆ సమస్యనుంచి బయిటపడటానికి అతను ఏం ప్రయత్నం చేసాడు..ఎలా తన సమస్యలను అధిగమనించాడు అన్న థోరణిలో స్క్రిప్టు రాసుకున్నారు. అయితే రెగ్యులర్ ప్యాడింగ్ ఆర్టిస్టి లు కాకుండా కొత్తగా అనిపించే వాళ్లు ఎక్కువ మంది ఉండటంతో కథని ఓపెన్ చేసిన కాసేపటి వరకూ చాలా గందరగోళం కనిపిస్తుంది.దానికి తోడు ఓ సైంటిఫిక్ విషయాన్ని మన బుర్రలోకి ఎక్కించి ప్రయత్నం చేస్తారు. అయితే అది కొద్ది సేపే…ఒక్కసారి కథలోకి వచ్చాక ..తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి కలుగుతుంది. ఓ డిటెక్టివ్ నవల చదువుతున్నట్లు తర్వాత ఏం జరుగుతుందనే ఇంట్రస్ట్ కలుగుతుంది. తెలివైన స్క్రీన్ ప్లే కాకుండా ప్రేక్షకులని తికమకపెట్టకుండా ఉండే స్క్రీన్ ప్లే రాసుకుంటే చాలు అని రాసుకున్నట్లన్నారు.
ఓటిటిలకు అలవాటుపడుతున్న ఈ జనరేషన్ ప్రేక్షకులని ఆలోచనల్లో పడేయాలే లక్ష్యంతో కథను నడిపారు. అయితే కథలో కంటెంట్ ఎక్కువ అవటం, కొత్త ఆర్టిస్ట్ లు తో తొలి ఇరవై నిమిషాలు తికమకగా వుంటుంది. ఇలాంటి కథ ఓపెన్ చేసినప్పుడు ఒక ఎమోషన్ తో ప్రేక్షకుడు కనెక్ట్ చేసేయాలి. అందుకు టైమ్ తీసుకున్నారు. అలాగే ఇలాంటి థ్రిల్లర్ కథల్లో ఉత్కంఠ నెలకొల్పడం చాలా కీలకం. విలన్ చేతిలో ఇరుక్కుపోయిన హీరోకు ఏదైనా జరుగుతుందేమో అనే టెన్షన్ క్రియేట్ కావాలి.. అలా చేయటంలో చాలా భాగం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. దాంతో హీరోకు ఏం కాదులే అని రిలాక్స్ అవటానికి ప్రేక్షకులుకు అవకాసం దొరకలేదు. ఇది కంప్లీట్ గా దర్శకుడి సినిమా. ఇందులో ప్లస్ పాయింట్స్ కూడా వున్నాయి.ముఖ్యంగా కొత్త హీరోపైనా భారీ యాక్షన్ సీన్లు కనిపిస్తాయి. చివర్లో హ్యాకింగ్ నేపధ్యంలో డిజైన్ చేసిన ఫైట్ సీక్వెన్స్ ఒక స్పెషల్ ఎట్రాక్షన్. యాక్షన్ ని ఇష్టపడే వారికి ఇవన్నీ బాగా నచ్చుతాయి.

బ్యానర్: హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్
నటీనటులు: వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్ , ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు.
సంగీతం : మార్క్ k రాబిన్
సినిమాటోగ్రఫీ : ఉరుకుండారెడ్డి
విఎఫ్ఎక్స్ : ఆనంద్ పల్లకి
ఎడిటర్: టి.సి.ప్రసన్న
దర్శకత్వం: హరీష్ సజ్జా
నిర్మాత: హరిత సజ్జా
విడుదల తేదీ:10, మార్చి 2023.
Rating:2.75