తమిళ స్టార్ హీరో సూర్య గతేడాది నటించిన ‘జై భీమ్’ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. తర్వాత దానిపై చిత్ర దర్శక నిర్మాతలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ‘జై భీమ్’ సీక్వెల్ పై చిత్ర నిర్మాత రాజశేఖర్, దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జై భీమ్’ సీక్వెల్ పై అడిగిన ప్రశ్నలకు వారు ఇలా సమాధానం చెప్పారు.
2022 నవంబర్ లో ఓటీటీ వేదికగా ‘జై భీమ్’ సినిమాను విడుదల చేశారు మేకర్స్. ఆ సమయంలో కోవిడ్ కారణంగా థియేటర్లు మూత పడటంతో సినిమాను ఓటీటీ వేదికగా రిలీజ్ చేశారు. అయితే సినిమాకు ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ సీక్వెల్ పై ఉత్కంఠ నెలకొంది.
‘‘ప్రముఖ న్యాయవాది జస్టిస్ చంద్రు ఎన్నో కేసులను వాదించారు. అందులో ఓ కేసును తీసుకొని జై భీమ్ ను తెరకెక్కించాం. ఆయన వాదించిన మరిన్ని కేసులతో సీక్వెల్ ను తీయవచ్చు’’ అని సమాధానమిచ్చారు. దీనిబట్టి చూస్తే త్వరలోనే ‘జై భీమ్’ సీక్వెల్ పై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కరోనా వల్ల ఈ చిత్రం నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని మేకర్స్ చెప్పారు. లీజో మోల్ జోస్, మణికందన్ కీలక పాత్రలు పోషించారు. టీజే. జ్ఞానవేల్ (TJ. Gnanavel) దర్శకత్వం వహించాడు.
జై భీమ్‌ను గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ‘ఇండియన్ పనోరమా ఫీచర్ ఫిలిం ఫెస్టివల్ సెక్షన్’ లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫిలిం ఫెస్టివల్లో చిత్ర బృందం పాల్గొంది. సినిమా స్క్రీనింగ్ అనంతరం డైరెక్టర్, కో ప్రొడ్యూసర్ మీడియాతో ముచ్చటించారు
జై భీమ్లోకి సూర్య ఏవిధంగా వచ్చాడో కూడా వివరించాడు. ‘‘సినిమాను నిర్మించాలని సూర్యను కలిశాం. కానీ, కథ విన్నాక నేను సినిమాలో చేస్తానని సూర్య చెప్పాడు’’ అని రాజేశేఖర్ పాండియన్ పేర్కొన్నాడు. విల్లుపురంలో 1993లో ఇరులర్ తెగ ప్రజలకు వ్యతిరేకంగా జరిగిన ఒక రియల్ ఘటనను ఆధారంగా చేసుకుని జై భీమ్‌ను రూపొందించారు. అయితే, సూర్య, టీజే. జ్ఞానవేల్ కలసి ఓ సినిమా చేస్తామని గతంలోనే ప్రకటించారు. ఆ సినిమా ‘జై భీమ్ 2’ నా లేదా ఏదైనా కొత్త సినిమానా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.