Home TelanganaTv ‘వాల్తేరు వీరయ్య’ రివ్యూ రేటింగ్స్ పై చిరు సెటైర్స్

‘వాల్తేరు వీరయ్య’ రివ్యూ రేటింగ్స్ పై చిరు సెటైర్స్

5
0
Reading Time: < 1 minute

గ్యాప్ తర్వాత చిరంజీవి రీమేక్‌ మూవీ ‘ఖైదీ నెం150’తో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి వి.వి వినాయక్‌ దర్శకత్వం వహించారు. అయితే చిరు రీఎంట్రీ సినిమా కావడంతో ఫ్యాన్స్‌ ఎగ్జైట్‌ అయ్యారు. కానీ ఆయన రీఎంట్రీకి పడాల్సిన హిట్టు మాత్రం పడలేదు. ఆ తర్వాత కూడా చెప్పుకోదగిన హిట్స్ రాలేదు. చివరికి కొడుకు రామ్‌చరణ్‌తో కలిసి నటించిన ‘ఆచార్య’ కూడా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే, చిరంజీవికి ‘గాడ్ ఫాదర్’, కాస్త రిలీఫ్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే అదీ బ్లాక్ బస్టర్ కాదు. దాంతో ఆ రేంజి హిట్ కోసం చిరంజీవి శ్రమించారు. సాధించారు. అదే ‘వాల్తేరు వీరయ్య’ సినిమా.

దర్శకుడు బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్ర చేసారు. ఈ సినిమా మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ అందుకుంది. పండగ రోజుల్ని మరింత జోష్ ఫుల్ గా మార్చింది. చిరు లుక్ కు.. ఆయన మాస్‌ యాక్టింగ్‌కు ఈలలు పడ్డాయి. ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా.. వింటేజ్ వీరయ్యగా అభిమానులను అలరిస్తూ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. కలెక్షన్లను కుమ్మేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ చిత్రం హిట్ తో చిరంజీవి మంచి ఉషారుగా ఉన్నారు. ఆయన ఈ చిత్రం యుఎస్ రివ్యూలపై కామెంట్స్ చేసారు.

చిరంజీవి మాట్లాడుతూ…‘వాల్తేరు వీరయ్య’ US ప్రీమియర్ రివ్యూ రేటింగ్ లు 2.25 ఇచ్చారని..అయితే తాను వాటిని తప్పుగా అర్దం చేసుకున్నానని, వాటి అర్దం USలో వచ్చే కలెక్షన్స్ గురించి అని ఇప్పుడు తెలుస్తోందని సెటైర్ వేసారు.USA ($2.25M USD) లో అదే సేమ్ ఫిగర్ కలెక్ట్ చేసిందని అన్నారు. ఇది విన్న అభిమానులు ఉత్సాహంతో విజిల్స్ వేసారు.

ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటించింది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ కొట్టిన సంగీతం, ఇచ్చిన పాటలు హైలెట్ అయ్యాయి. మాస్ సాంగ్స్‌తో ఊపు ఊపేసాడు. ఈ సారి సంక్రాంతికి మైత్రి మూవీస్ పోటీ పడ్డాయి. ఇటు చిరంజీవి, అటు బాలయ్య సినిమాలతో మైత్రీ మూవీస్ సందడి చేసింది.

Previous articleResearchers working on Covid vaccine that people can drink
Next articleట్రేడ్ కు షాక్ ఇస్తున్న ‘పఠాన్’ అడ్వాన్స్ బుక్కింగ్ లు