విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా చేసింది. ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చుంది. తాజాగా ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 22న విడుదల చేసేందుకు చిత్రబృంద సన్నాహాలు చేస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమాకు ఇప్పటికే బుకింగ్స్ మొదలు కాగా దాస్ కా ధమ్కీ సినిమా తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిందని విశ్వక్ సేన్ చెబుతున్నారు. ఈ సినిమా నైజాం హక్కులు 3 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
మరో ప్రక్క రవితేజ తాజా చిత్రం ధమాకా, దాస్ కా ధమ్కీ సినిమాల కథలు ఒకటేనని మీడియాలో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విశ్వక్ సేన్ షాకింగ్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కథ విషయంలో నాకే ఎక్కువ క్లారిటీ రావడంతో నేనే డైరెక్టర్ గా మారానని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. దాస్ కా ధమ్కీలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నానని ఆయన తెలిపారు. ధమాకా, ధమ్కీ పోలికలపై స్పందిస్తూ ఒకే కథను ఇద్దరు కొనుక్కోవడానికి మేమేమైనా పిచ్చోళ్లమా అని విశ్వక్ సేన్ ప్రశ్నించారు.
అలాగే ప్రసన్న కుమార్ ఒకే కథ ఇస్తే ఇండస్ట్రీలో ఎలా తిరుగుతాడని ఆయన తెలిపారు. ధమ్కీ రీషూట్ వార్తల్లో నిజం లేదని విశ్వక్ సేన్ అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ వల్ల రిలీజ్ డేట్ మారిందని ఆయన కామెంట్లు చేశారు. సినిమాలో 40 పీపుల్ ఫైట్ ఉంటుందని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.
తాజాగా హైదరాబాద్‌లో శుక్రవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. విశ్వక్ సేన్‌కు, చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. విశ్వక్ సేన్ అద్భుతమైన నటుడంటూ కితాబిచ్చారు.