Home TelanganaTv ఉపేంద్ర “కబ్జ” కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి.?

ఉపేంద్ర “కబ్జ” కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి.?

7
0
Reading Time: < 1 minute

తెలుగులో చాలా కాలంగా కనిపించని ఉపేంద్ర క్రేజ్ మళ్లీ ‘కబ్జ’ (Kabzaa) సినిమాతో కనిపించింది. ఉపేంద్రతో పాటు కిచ్చా సుదీప్, శ్రియ లాంటి స్టార్లు నటించడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. శ్రియతో కలిసి ఉపేంద్ర హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు ఆడియన్స్ తెగ హడావుడి చేశారు. ఉపేంద్ర గ్యాంగ్‌స్టర్‌గా నటించిన ఈ కన్నడ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఈరోజు విడుదలైంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. హైదరాబాద్‌లోనే పెద్దగా బుకింగ్స్ లేకపోవడం ఆశ్చర్యకరం.

ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా అంత మంచి టాక్ రాలేదు కానీ మొదటి రోజు మాత్రం సాలిడ్ వసూళ్లు రాబట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా అయితే మొత్తం 26 కోట్లు వసూలు చేసినట్టుగా కొన్ని పోస్టర్ లు ట్రేడ్ వైరల్ గా మారుతున్నాయి. వాస్తవానికి అయితే అసలు ఈ సినిమాకి అంత రేంజ్ వసూళ్లు రాలేదని తెలుస్తుంది. దాదాపు 10 నుచి 12 కోట్ల మేర మాత్రమే వచ్చినట్టు సమాచారం. డిజప్పాయింటింగ్ టాక్ తో మొదలైన ఈ సినిమా విజయంపై ఎవరికీ నమ్మకం లేదు.

ఈ సినిమా చూసిన ఉపేంద్ర అభిమానులు సినిమా చాలా బాగుందని అంటుంటే.. ఇంకొందరు అస్సలు బాగాలేదని, థియేటర్ నుంచి మధ్యలోనే బయటికి వచ్చేశామని చెబుతున్నారు. చాలా మంది ఈ సినిమాను ‘కేజీయఫ్‌’తో పోలుస్తున్నారు. ఆ సినిమాను మరోసారి చూసినట్టే ఉందని అంటున్నారు. అయితే, థియేటర్‌కు వెళ్లే ముందు ‘కేజీయఫ్’ బుర్రలోంచి తీసేసి వెళ్లాలని కొందరు సూచిస్తున్నారు. ‘కబ్జ’ను ఫ్రెష్ ఫీల్‌తో చూస్తేనే ఎంజాయ్ చేస్తారని చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో శ్రేయ హీరోయిన్ గా నటించగా రవి బసృర్ సంగీతం అందించాడు. అలాగే ఆర్ చంద్రు మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

Previous articleరిలీజ్ కు ముందే రివ్యూలు, ఓపినింగ్స్ తెచ్చిపెడతాయా ?
Next articleMan vs. Algorithm: What dark secrets did ‘Zwigato’ expose to Nandita Das