Categories
Uncategorized

పెళ్లి ప్రకటన తో లిప్ లాక్ , ముదురు ప్రేమికుల కొత్త ట్రాక్

Reading Time: < 1 minute

పెళ్లి ప్రకటన ఎలా చేస్తారో అనేది అందరికీ తెలిసిందే. అందులో మజా ఏముటుంది. అందుకే టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు న‌రేష్, న‌టి ప‌విత్రా లోకేష్ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తను కాస్తంత డిఫరెంట్ గా ప్రపంచానికి చెప్పాలనుకున్నారు. సోషల్ మీడియాలో లిప్ లాక్ కిస్సులతో కూడిన వీడియోతో ప‌విత్రా లోకేష్‌ను పెళ్లాడ‌బోతున్న‌ట్లు శ‌నివారం న‌రేష్ ప్ర‌క‌టించారు. ఓ వీడియోను ద్వారా వివాహ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేశాడు. . ఇందులో న‌రేష్‌, ప‌విత్ర క్యాండిల్స్ వెలిగిస్తూ క‌నిపించారు. ఆ త‌ర్వాత ప‌విత్రా లోకేష్‌కు న‌రేష్ లిప్‌లాక్ ఇస్తూ క‌నిపించాడు.

న్యూ ఇయ‌ర్‌, న్యూ బిగినింగ్స్‌..మీ అంద‌రి ఆశీస్సులు కావాలి మీ #PavitraNaresh అంటూ షేర్ చేసిన వీడియోకు హ్యాష్ ట్యాగ్ ని జ‌త చేశారు. ఈ వీడియో చూసిన వాళ్లు చాలా మంది సినిమా స్టంట్ నా నిజ‌మా..ఏదైనా న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ కు ఆల్ ద బెస్ట్ ‘అంటున్నారు. ప్ర‌స్తుతం న‌రేష్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. న‌రేష్‌కు ఇది నాలుగో వివాహం కాగా ప‌విత్రా లోకేష్‌కు రెండోది.

ఇక సినీ నటుడు నరేశ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేశ్ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా వీరిద్దరూ న్యూస్ హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. మూడో భార్య ర‌మ్య ర‌ఘుప‌తితో మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో ఆమెకు దూరంగా ఉంటున్నారు న‌రేష్‌. ప‌విత్రా లోకేష్‌తో పాటు న‌రేష్ రిలేష‌న్‌షిప్‌పై కొంత కాలం క్రితం తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేసింది ర‌మ్య ర‌ఘుప‌తి. విడాకులు తీసుకోకుండానే న‌రేష్ ఆమెతో లివింగ్ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ట్లు వ్యాఖ్యానించింది.