Categories
Uncategorized

Prabhas:రూమర్ కాదు… డైరక్టర్ కన్ఫర్మ్ చేసాడు

Reading Time: < 1 minute

శ్రీరాముని పాత్రలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. సీతగా కృతి సనన్ కనిపించనున్నారు. ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ప్రజెంట్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ని కొత్త గెటప్ లో ఎలా ఉంటాడా అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈరోజుతో అయితే వారి నిరీక్షణకు ఫుల్ స్టాప్ పడినట్లే.

స్వయంగా దర్శకుడు ఓంరౌత్ నుంచి ఆ గుడ్ న్యూస్ ఏదో బయటకి వచ్చేసింది. తమ ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ సహా ఆదిపురుష్ టీజర్ ని కూడా ఈ అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్టుగా తన అధికారక ట్విట్టర్ నుంచి తెలిపాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12నే ఐమ్యాక్స్, 3D లలో అత్యంత గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు కూడా మెన్షన్ చేసాడు.

‘ఆదిపురుష్’ సినిమాను టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుమారు 500 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తీస్తున్నారట. ఇందులో సీత పాత్రలో కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి 12, 2023న ప్రపంచవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ త్రీడీలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.